హైదరాబాద్ లోని నార్సింగిలో డిటోనేటర్ పేలుళ్లు సంభవించాయి. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పేలుళ్ల సమయంలో ఆకాశంలోకి ఎగిరి బండ రాళ్లు కింద పడ్డాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి నార్సింగీ పోలీసులు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. గత మూడు రోజుల క్రితం డిటోనేటర్లను కాంట్రాక్టర్ అమర్చగా ఒక్కసారిగా పేలింది.
Blast in Narsingi: మై హోమ్ అవతార్ సమీపంలో పేలిన డిటోనేటర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES