Friday, September 20, 2024
HomeతెలంగాణMetpally: కోరుట్ల బరిలో సిఎస్ఆర్

Metpally: కోరుట్ల బరిలో సిఎస్ఆర్

స్వతంత్ర అభ్యర్థిగా..

మెట్ పల్లి పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్ లో సిఎస్అర్ పౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాస్ రావు తన కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… గల్ఫ్ కార్మికులు, రైతులు, బీడీ కార్మికులు, ప్రజలందరి కోరిక మేరకు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేస్తున్నాని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పింఛన్ల పేరుతో మహిళలను మోసాగిస్తున్నారని, మగవారిని త్రాగుడుకు బానిసలుగా మారుస్తున్నారని, యువకులను ఉద్యోగాల పేరుతో మోసగించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రమచ్చేదాకా ఒక మాట రాష్ట్రం వచ్చిన తర్వాత మాట మార్చారాని తన ఖజానా నింపుకోవడానికి కుటుంబ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు.

- Advertisement -

ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ అప్పుల పాలు చేశారన్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదన్నారు. రైతులకు అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే పది పైసలు కూడా ఇవ్వలేదు అన్నారు. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఏ ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదని, తనకు సంబంధించిన మనుషులకే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తించేలా చేశారన్నారు. పేద ప్రజలను కాపాడలేకపోయారన్నారు. రాజకీయాలు ఇష్టం లేకపోయినా నియోజకవర్గంలో గల్ఫ్ కార్మికులు రైతులు, ప్రజలు పడుతున్న ఆవస్థలను చూసి చలించిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారన్నారు. ఇప్పటినుండి 30 రోజుల సమయం ఉన్నాగాని మూడు రోజులు సరిపోతుందన్నారు. నియోజకవర్గంలో తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సియస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News