స్పూనుడు గసగసాలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది.
బరువు తగ్గాలంటే ద్రాక్షరసం, అనాసరసం, టొమాటోరసం, జామ, అవకడో రసాలు ఏవైనా సరే తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్లు సున్నపు తేటను కలిపి ఉదయంపూట తాగితే మూడురోజుల్లో నడుం నొప్పి తగ్గుతుందని ఆయుర్వేదనిపుణులు చెప్తున్నారు. ఖర్జూరం పండు తిని వేడి నీళ్లు తాగితే కూడా నడుం నొప్పి తగ్గుతుందిట.
దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వేడినీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఉసిరికాయను నిత్యం తింటే వెంట్రుకలు నల్లగా నిగ నిగలాడుతుంటాయి.
చిన్న పిల్లలకు జలుబు వెంటనే తగ్గాలంటే తమలపాకులను బాగా నలిపి ఆ వచ్చే రసంలో కొద్దిగా తేనె వేసి పిల్లల చేత నాకించాలి
ఎంతకూ తగ్గని పుండుపై సీతాఫలం ఆకులు పేస్టులా నూరి కట్టుకడితే వారం రోజుల్లో ఆ పుండు తగ్గుతుంది.
ఇంగువ, హారతి కర్పూరం సమానంగా తీసుకుని కంది గింజంత ఉండలు చేసుకుని రోజుకో ఉండ నోట్లో వేసుకుంటే ఉబ్బసం, ఆయాసం, గుండెదడ తగ్గుతాయి.
వేరుశెనగనూనెతో శరీరానికి మసాజ్ చేసుకుంటే ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
సెగ గడ్డలు వస్తే బియ్యప్పిండి ఉడకబెట్టి దాన్ని కొద్దిగా సెగగడ్డపై వేసి కట్టుకడితే సెగగడ్డ చితికిపోతుంది.
కొబ్బరినూనెలో హారతికర్పూరం పొడిచేసి కలిపి రాస్తే దద్దుర్లు, దురద తగ్గుతాయి.
రోజూ ఉదయమే గ్లాసుడు నీళ్లల్లో అరచెక్క నిమ్మకాయ పిండి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే బరువు తగ్గుతారు.
గంధం చెక్క అరగదీసి ఆ పేస్టును వాపుల మీద రాస్తే వాపులు త్వరగా తగ్గుతాయి.
కరక్కాయ ముక్కను నోట్లో బుగ్గన పెట్టుకుంటే పొడిదగ్గు నుంచి ఉపశమనం పొందుతాం.
ఆముదాన్ని అరికాళ్లకు రాసుకుంటే ఎంతో మంచిది.
వేలు తెగిన చోట వెల్లుల్లి రసాన్ని రాస్తే అక్కడ బాక్టీరియా చేరదు.