Saturday, October 5, 2024
HomeతెలంగాణPonnam: అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కి ఓటెయ్యండి

Ponnam: అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కి ఓటెయ్యండి

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండలంలోని ఓబులాపూర్ గురుకుల పల్లె ముది మాణిక్యం రామంచ చిన్న ముల్కనూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం ఘనంగా చేశారు. పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించగలరని, నన్ను ఆశీర్వదించగలరని హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలను శాసనసభ వేదికగా గొంతెత్తి పరిష్కరిస్తానని నా మొత్తం శక్తిని ఉపయోగిస్తానని అన్నారు.

- Advertisement -

గత 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను నిలబెట్టుట గురించి మీ బిడ్డ ఏ రకంగా తెలంగాణ కోసం పోరాటం చేశాను మీ అందరికీ తెలుసు. ఎక్కడికెళ్లినా తెలంగాణ పోరాటంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఎక్కడికి వెళ్లిన తల ఎత్తుకునే విధంగా ఉన్నాను తప్పితే తలదించేటట్లు ఉండలేదని గుర్తు చేశారు. అలాంటి సందర్భంలో తెలంగాణ సాధించుకున్న తరుణంలో 2014 నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ అయ్యాయని మన జీవితాలు పెనం మీద కెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా అయినాయి తెలంగాణలో 60 కోట్ల అప్పు పోయి ఆరు లక్షల కోట్ల అప్పులు అయినాయి పేద ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూములు రాలేదు మన పిల్లలకు ఇస్తానన్న ఉద్యోగాలు రాలేదు కొత్త రేషన్ కార్డు రాలేదు దళితులకు మూడెకరాలు రాలేదు నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి రాలేదు ఏమొచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంపద వచ్చింది యావత్ తెలంగాణ ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఈ ప్రభుత్వం పోవాలి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెవిలో చెప్పుకున్నట్లుగా చర్చలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలనీ అందులో మీ అందరి పాత్ర ఉండాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 2004లో మాట ఇచ్చిన ప్రకారం ఒకేసారి రైతుల రుణమాఫీ చేసిందని, ఉచిత విద్యుత్తును ఇవ్వడం జరిగిందని విద్యార్థులకు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చామన్నారు. మండల పార్టీ అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమల్ల రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు పోలీస్ స్వప్న కాంగ్రెస్ నాయకులు పూదరి వేణు ఎండ్రా అనిల్ కుతుబుద్దీన్ కూన రాజయ్య కోనేటి రాములు అనువోజు బాలకిషన్ చారి కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు ఎలగందుల లక్ష్మణ్ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News