ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తమతో కలిసి బిహార్ లో సర్కారు ఏర్పాటు చేశారన్న కారణంతో లాలూపై మూసేసిన కేసు తిరగతోడుతున్నారని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. లాలూపై ఉన్న కేసులను సీబీఐ రీ ఓపన్ చేయటం వెనుకున్న వ్యక్తులు ఎవరు, ఉద్దేశాలు ఏమిటో అందరికీ తెలుసునంటూ నితీష్ మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ ..లాలూపై 2018లో కేసు తెరిచి, 2021లో మూసేశారని గుర్తు చేశారుకూడా. ఈ కేసు తిరగతోడినా సీబీఐకి వచ్చేదేమీ లేదని బిహార్ డిప్యుటీ సీఎం, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు. రైల్వే మంత్రిగా లాలూ అధికారంలో ఉన్నప్పుడు .. ఢిల్లీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి లాభం చేకూర్చుతూ రైల్వే ప్రాజెక్ట్స్ కేటాయించినట్టు లాలూ కుటుంబంపై ఆరోపణలున్నాయి. లాలూ కుమారుడు తేజస్వి, చందా యాదవ్, రాగిణి యాదవ్ అనే ఇద్దరు కుమార్తెలపై ఈమేరకు ఆరోపణలున్నాయి. తమ కుటుంబ సభ్యులు తెరిచిన పుస్తకాల వంటివారని తేజస్వి పదేపదే చెప్పుకొస్తున్నారు.