నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని బిహార్ మహాఘట్బందన్ సర్కార్ చాలా ఎక్స్ పెన్సివ్ నిర్ణయం తీసుకుని బిహారీలకు షాక్ ఇస్తోంది. వీఐపీలు, వీవీఐపీలు తిరిగేందుకు కొత్త జెట్ ప్లేన్స్, హెలిక్యాప్టర్స్ కొనాలని నితీష్ సర్కారు నిర్ణయించింది. ఈమేరకు బిహార్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ ఒంటికాలుపై లేచింది. పాత ఎయిర్ క్రాఫ్టుల స్థానంలో సరికొత్తవి, అత్యాధునికమైనవి కొనేలా నితీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం విశేషం. డిప్యుటీ సీఎం తేజస్వి యాదవ్ ఎలాగూ వచ్చే ఏడాది ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి ఆయన అధికారిక పర్యటనల కోసం కొత్త ప్లేన్స్, హెలిక్యాప్టర్స్ కొనాలంటూ నితీష్ పై ఒత్తిడి పెరిగిందంటూ విపక్ష నేత సీఎం సుశీల్ మోడీ ఆరోపిస్తున్నారు. 250కోట్ల రూపాయల ఖర్చుతో జెట్ ప్లేన్స్ కొనటం అంటే ప్రజా ధనం దుర్వినియోగం అయినట్టు కాదా అంటూ మాజీ డిప్యుటీ సీఎం సుశీల్ సర్కారును నిలదీస్తున్నారు.