డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని… ప్రజల ఆశీస్సులు… దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలకు చెందిన వివిధపార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. కూసుమంచి మండలం యర్రగడ్డ తండా సర్పంచ్ జర్పుల అనసూర్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యర్రగడ్డ తండా గ్రామానికి చెందిన సుమారు 300 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరాయి.
బోడియా తండా బాణోతు వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 100కుటుంబాలు చేరాయి. అదేవిధంగా పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ అయితగాని రామ్ గోపాల్, జీళ్ల చెర్వు దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ ముద్రబోయిన సత్యనారాయణ, మత్య్సశాఖ సొసైటీ చైర్మన్ ముద్రబోయిన వెంకటనర్సయ్యతో పాటు మరికొన్ని కుటుంబాలు జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య, ఇంటూరి పుల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గన్యా తండా నుంచి 20 కుటుంబాలు, మల్లేపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు, 40వ డివిజన్ లో నివసిస్తున్న సుమారు 100కు పైగా ఒరిస్సాకు చెందిన మైనారిటీ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. ముత్యాల సురేష్, గుమ్మళ్ల శ్రీనివాస్, ఒరిస్సా మైనారిటీ అధ్యక్షులు షేక్ షెరుద్దీన్, మగుబన్ బాయ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మల్లయ్య తదితరులు పొంగులేటి సమక్షంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరితో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జొన్నలగడ్డ రవి, జూకూరి గోపాలరావు వెంకట్ రెడ్డి, యడవల్లి రామిరెడ్డి, బొల్లం సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఖాదర్ బాబు, సెట్రం నాయక్, ఖలీం, బాణోతు రాములు నాయక్ తదితరులు ఉన్నారు.