Saturday, April 5, 2025
HomeతెలంగాణMadhu Yashki: పాదయాత్ర ద్వారా మధుయాష్కి ప్రచారం

Madhu Yashki: పాదయాత్ర ద్వారా మధుయాష్కి ప్రచారం

ఉత్సాహంగా మధు యాష్కి

ఎల్బి నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్. నేడు మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్బి నగర్ కూడలిలో మహనీయుల విగ్రహాలకు పూల మాలలు వేసి అనంతరం మధు యాష్కి పాదయాత్రలో పాల్గొన్నారు. ఎల్బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. సుధీర్ రెడ్డి పరిపాలనలో మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధి శూన్యమని అన్నారు. డివిజన్ లో పలు కాలనీలో, సిసి రోడ్లు డ్రైనేజీ సమస్య అధికంగా ఉండడంతో దీని ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీవో నెంబరు 58, 59 ప్రకారంగా రెగ్యులరైజేషన్ ఇండ్ల పట్టాలకు అప్లికేషన్ ఫీజు అధికంగా పెంచి పేద ప్రజల నోట్లో మన్ను కొడుతున్నారని సుధీర్ రెడ్డి పై మండిపడ్డారు. ఈ సమస్యలేవీ తనకు పట్టనట్టుగా మాటలకే పరిమితమైన సుధీర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో గద్దె దింప్పి, కాంగ్రెస్ పార్టీ తరపున మధు యాష్ కి ని అత్యంత మెజారిటీతో గెలిపించి మన నియోజకవర్గాన్ని మనమే అన్ని విధాలుగా
అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు హామీ ఇచ్చారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, జిఎచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కళ్లెం నర్సింహా రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భీమిడి రామకృష్ణ రెడ్డి, పలు డివిజన్ ల అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి డివిజన్ స్థాయి సీనియర్ నాయకులు మహిళా నాయకులు, పలు కాలనీల అధ్యక్షులు, సభ్యులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News