Saturday, November 23, 2024
HomeతెలంగాణYennem: అధికారులు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి

Yennem: అధికారులు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి

ఇబ్బందులు పెడుతున్న ప్రతి అధికారికి రాజ్యాంగ బద్దంగా శిక్ష

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలని, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఇప్పుడు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న ప్రతి అధికారికి రాజ్యాంగ బద్దంగా శిక్ష ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంతో ఈ ఎన్నికలు ఎదుర్కొంటుందని అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లో పదివేల మంది యువకులు కొత్తగా పార్టీలో చేరారన్నారు.

- Advertisement -

గ్రామ స్థాయి నాయకులు సైతం మా వెంట ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభజనం మొదలైంది.. ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. సమస్త తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గెలుపు కోసం నిలబడిందని ధీమా వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని, కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారు. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని పేర్కొన్నారు.

ఎన్ పి వెంకటేష్ మాట్లాడుతూ… మాది కప్పు, సాసర్ల అభివృద్ధి కాదని ప్రజల గుండెల్లో నిలిచిపోయే అభివృద్ధి అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేత దగ్గర ఓటర్ల కన్నా ఎక్కువగా ఆయన వేసినా కండువాలు ఉన్నాయని ఛలోక్తి విసిరారు. ఈ సమావేశంలో సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News