Monday, November 25, 2024
Homeనేషనల్SC: కాసేపట్లో నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు

SC: కాసేపట్లో నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు

మనదేశాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 2016సంవత్సరంలో మోడీ సర్కారు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసింది. రెండు వేర్వేరు తీర్పులు మరికాసేపట్లో వెలువడనుండగా దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై 58 పిటిషన్లను ధర్మాసనం విచారించి, తీర్పు వెలువరించనుంది. అసలు నోట్ల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై నేటికీ సామాన్యుడు జుత్తు పీక్కుంటున్నాడు. మరోవైపు అసలు పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన కారణాలేంటో సవివరంగా రికార్డులతో సహా అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News