Saturday, November 23, 2024
HomeతెలంగాణPalla @ Cheryala: గడప గడపకు పల్లా ప్రచారం

Palla @ Cheryala: గడప గడపకు పల్లా ప్రచారం

ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు

అవకాశం ఇవ్వండి చేర్యాల పట్టణాన్ని సుందరీకరణ చేస్తానంటూ చేర్యాల పట్టణ ప్రజలకు జనగామ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వల్ల రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. చేర్యాల మున్సిపాలిటీలోని వార్డులో ఇంటింటి ప్రచారంలో గెలుపే ధ్యేయంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులను కలుపుకుని ప్రచారం నిర్వహించారు.

- Advertisement -


చేర్యాల టౌన్ లోని 1, 2, 3, 11, 12, 5, 6, 4, 10 వార్డుల్లో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఆడపడుచుల మంగళ హారతులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ ఓట్లు అభ్యర్థిస్తూ వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు మేనిఫెస్టోను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, మూడోసారి గెలిపించాలని కోరారు.

చేర్యాలకు ఓ చరిత్ర ఉంది

తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు ఓ చరిత్ర ఉంది.
చేర్యాలకు సంబంధించి, టౌన్ అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ చూసుకుంటున్నడు..
చేర్యాల పట్టణానాన్ని సుందరీకణ చేస్తా ఇప్పుడిచ్చిన 10 కోట్లు సరిపోకుంటే ఇంకా కొన్ని నిధులు తెచ్చి చేర్యాలను అద్బుతంగా తీర్చిదిద్దుతా.. అర్హులైన వారికి ఎన్నికలు అయిపోగానే నెల రోజుల్లో అర్హులందరికీ, పెండింగ్ లో ఉన్న వాళ్లందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే అంటూ ఆయన ప్రసంగం సాగుతోంది.

చేర్యాల పట్టణానికి ఏం కావాలో నాకు తెలుసు. చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయమై ఇటీవల జనగామ సభలో ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. కొంత మంది జేఏసీ నాయకులు వారికేం కావాలో నన్ను అడగాలె. కానీ గో బ్యాక్ అని అనడం సరికాదు. వాళ్లకు కావాల్సిన చేర్యాల రెవెన్యూ డివిజన్ ను పట్టుబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జనగామ సభలో ప్రకటింపజేసిన. అది నా బాధ్యత రెవెన్యూ డివిజన్ అయింది.ఎన్నికలై పోగానే జీవో రావడమే తరువాయి.

సీఎం ఒక నియోజవర్గానికి ఒకసారి వస్తడు కానీ జనగామ నియోజకవర్గానికి రెండోసారి ఈనెల 18న సీఎం కేసీఆర్ చేర్యాలకు వస్తున్నాడు. చేర్యాల పట్టణాభివృద్ధికి సరిపడా నిధులు కావాలని ముఖ్యమంత్రిని అడిగి చేర్యాల పట్టణంతోపాటు అన్ని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.

పలు పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరికలు

మద్దూరు మండలం వంగపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఉప్పరోనిగడ్డకి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి మద్దూరు మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి అభ్యర్థి పల్లా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీఏసిఎస్ చైర్మన్ నాగిళ్ళ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమిరే రామస్వామి, మేకల రాజు, దుర్గం కొమురయ్య, దుర్గం యాదగిరి, కొమిరే యాదగిరి, గోడపర్తి ఏలీయా, పగిడిపాటి సుధాకర్, అనిల్, చాట్ల అంతయ్య, మెరుగు కృష్ణ, జంగ సంపత్, గణేష్, మేకల అరవింద్, కానుగంటి నర్సింహులు, మార్క నారాయణ, అర్జయ్య, రామకృష్ణ, పరమేశ్వర్, దాసు, మల్లయ్య, చందన్ మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News