Friday, November 22, 2024
Homeహెల్త్Jojoba: జొజాబా ఆయిల్ వాడుతున్నారా?

Jojoba: జొజాబా ఆయిల్ వాడుతున్నారా?

జొజాబా నూనె సౌందర్య పోషణలో రాణి. జొజాబా మొక్క గింజల నుంచి ఈ నూనెను తయారుచేస్తారు. ఈ తైలం పట్టులాంటి జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని తలనూనెగా వాడితే ఎంతో మంచిదంటారు సౌందర్యనిపుణులు. ఇందులోని హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని పరిరక్షిస్తాయి. పలు స్కిన్ కేర్ బ్యూటీ ఉత్పత్తుల్లో కూడా దీన్ని వాడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ జుట్టు, చర్మ రక్షణకు ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నూనెను మేకప్ రిమూవర్ గా వాడతారు. ఐలాష్ కండిషనర్ గా కూడా వాడతారు. పెదాలపై ఉన్న చర్మం చిట్లకుండా నున్నగా ఉండడానికి లిప్ బామ్ గా కూడా ఉపయోగిస్తారు. అందాన్ని ఇనుమడింపచేసే ఈ ఆయిల్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా 6 వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ రక్షణకు ఎంతో ముఖ్యమైనవి. చర్మంలోని తేమను ఇది పరిరక్షిస్తుంది. పొడి చర్మానికి, ఇరిటేషన్ గుణం ఉన్న చర్మానికి ఇది ఎంతో సాంత్వన నిస్తుంది.

- Advertisement -

ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఉన్నాయి. చర్మ కాంప్లెక్షన్ ని కూడా ఈ ఆయిల్ కాపాడుతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మంలో తేమ తగ్గకుండా ఈ ఆయిల్ సహాయపడుతుంది. మన చర్మంలోని తేమను, ఆయిల్ ని ఈ తైలం సమతుల్యం చేస్తుంది. యాక్నే సమస్య ఉన్న వారికి ఈ తైలం అద్భుతంగా పనిచేస్తుంది. కారణం ఇందులో యాంటీబాక్టీరియల్ సుగుణాలు బాగా ఉండడమే. ప్రత్యేకించి కొన్ని బాక్టీరియాలపై ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. యాంటి ఏజింగ్ గా ఈ తైలం ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణం, తేమ స్వభావం వల్ల చర్మం పై ముడతలు తొందరగా ఏర్పడవు. పలు చర్మ వ్యాధులపై కూడా ఈ తైలం బాగా పనిచేస్తుంది. ఐలేషస్, మస్కరా ఫార్ములేషన్స్ కు కూడా ఈ తైలం ఉపయోగిస్తారు.

అలాగే కనుబొమలు చిక్కగా కనిపించడానికి ఈ ఆయిల్ ని వాడతారు. జుట్టులో చేరిన చుండ్రును కూడా ఇది పోగొడుతుంది. మాడుకు ఈ తైలంతో మర్దనా చేసుకుంటే వెంట్రుకలు మరింత నిగ నిగ లాడుతుంటాయి. తలలో దురద రాదు. వెంట్రుకలకు తేమనందిస్తుంది. ఈ తైలాన్ని వెంట్రుకలకు రాసుకుంటే జుట్టు సిల్కీగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు తొందరగా నెరవవు. ఈ తైలంలోని ఖనిజాలు, విటమిన్ల వల్ల శిరోజాలు ద్రుఢంగా తయారవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. కుదుళ్లను పొడారిపోకుండా చేసి గట్టిపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్య పరిరక్షణకు ఈ తైలం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే చర్మం, శిరోజాల సంరక్షణకు ఈ తైలాన్ని వాడడం ఎంతో మంచిదని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. మరి ఈ రోజు నుంచి దీన్ని కూడా మీరు వాడే బ్యూటీ ఉత్పత్తుల్లో చేర్చేయండి. ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News