ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి చోటుచేసుకుంది. రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో వాహనం పైనుంచి కిందికి జారి పడ్డారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.
- Advertisement -
ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు కేటీఆర్. తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపిన కేటీఆర్ ఈసందర్భంగా వెల్లడించారు.