దేశంలోని ప్రతిపక్ష పార్టీల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీనే ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ వెల్లడించారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పీఎం క్యాండిడేట్ గా ఉంటారని కమల్ నాథ్ బాహాటంగా పేర్కొనటం విపక్ష పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది. భారత చరిత్రలో రాహుల్ గాంధీలా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర ఏ నేతా చేయలేదని కమల్ అన్నారు. అధికారం కోసం వెపర్లాడుతూ రాజకీయాలు చేసే తత్వం రాహుల్ ది కాదని ఆయన అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందంటూ కమల్ నాథ్ ప్రశంసించారు. మొత్తానికి 2024లో మళ్లీ మోడీ వర్సెస్ రాహుల్ అనేలా రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతం అయింది.
2024 పీఎం క్యాండిడేట్ రాహుల్ గాంధీనే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES