కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. సుమారు 50వేల మందితో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన తో వెళ్లి నామినేషన్ వేశారు. పురుమల్ల శ్రీనివాస్ ప్రభంజనాన్ని చూసి మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గుండెలు గుబేలు మంటున్నాయి. సర్పంచ్ శ్రీనివాస్ మంత్రిపై పోటీలో ఉంటూ కరీంనగర్ చరిత్రలోనే 50వేల మందితో కనివినీ ఎరుగని రీతిలో ర్యాలీ ప్రదర్శన చేపట్టి, నామినేషన్ వేయడంతో మంత్రి గంగుల కమలాకర్ కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ర్యాలీ ప్రదర్శనలో జై శ్రీనన్న.. జై కాంగ్రెస్ అంటూ వేలాది మంది స్వచ్చందంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో కరీంనగర్ మారుమోగింది. నామినేషన్ వేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గంగుల కమలాకర్ ఇక కాసుకో, నిన్ను ఓడించి కరీంనగర్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టిస్తానన్నారు. కరీంనగర్ లో నిరంకుశత్వ పాలనకు కరీంనగర్ ప్రజలు చమర గీతం పాడుతారని అన్నారు. గంగులకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. గంగుల కమలాకర్ పై 40 వేల మెజారిటీ తో విజయం సాధిస్తానని పేర్కొన్నారు. నాపై విశ్వాసంతో నామినేషన్ కార్యక్రమానికి స్వచ్చందంగా తరలి వచ్చిన వేలాది మందికి కాంగ్రెస్ , సీపీఐ, వైయస్ టిపి, నాయకులు, కార్యకర్తలకు, మహిళలు, యువత, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిత్ రావు, రమ్యారావు, వైద్యుల అంజన్ కుమార్, ఎస్ఏ మోసిన్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్, తజోద్దీన్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, మునిగంటి అనిల్, కుర్రపోచయ్య సలీముద్దీన్, సీపీఐ నాయకులు సృజన్ కుమార్, సురేందర్ రెడ్డిలతో పాటు వేలాది మంది ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.