కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ రెడ్డికి సిపిఐతో పాటు దాని అనుబంధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా హన్మంత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని.. కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజల్లోకి తీసుకువెళతామని తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సిపిఐ కార్యదర్శి ఈ. మహేష్, AITUC రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ కె. యేసురత్నం, హరినాద్, వి.శ్రీనివాసులు, బాచుపల్లి మండల కార్యదర్శి పి. శ్రీనివాస్, నిజాంపేట్ GHMC కార్యదర్శి A.యాదయ్య, సిపిఐ కల్చరల్ మెంబెర్స్ A. ప్రవీణ్, రాములు , హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వామి, జగద్గిరిగుట్ట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వామి, రవి, మహిళా సమాఖ్య నాయకురాలు హైమావతి తదితరులు పాల్గొన్నారు.