కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంపద పెంచుతామని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా రాష్ట్రలో ప్రజల జీవన స్థితిగతులు మారలేదని..అధిక ఆదాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇస్తే.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పుగా తెచ్చిన నిధులన్నీ అయిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. బి.ఆర్.ఎస్ పాలకుల దోపిడీ వల్ల రాష్ట్ర సంపద ప్రజలకు అందలేదని, జనాభాలో సగభాగమైన మహిళలు మహాలక్ష్మి పతకం, ఉచిత బస్సు సౌకర్యం వంటి గ్యారంటీ పథకాలు ప్రకటించామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తామన్నారు. ప్రజల్లో మార్పు రావాలి.. సంపద పెరగాలని, మీరు వేసి ప్రతి ఓటుకు విలువ తీసుకొస్తానంటూ.. భట్టి ప్రసంగం సాగింది.
Bhatti: ప్రజలకు సంపద పంచుతాం
సర్కారు ఏర్పడ్డ వంద రోజుల్లో 6 గ్యారెంటీల అమలు