రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతోంది ? సైలెంట్ వార్ నిజంగా సాగుతోందా? పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఎందుకు కనిపిస్తోంది? ఎవరికి ఈ పరిస్థితులన్నీ అనుకూలం? ఎవరికి ప్రతికూలం? అసలు జిల్లా రాజకీయ సమీకరణాలు రంజుగా ఎందుకు మారాయి? ఇవన్నీ ఇప్పుడు బరిలోని ప్రధాన పార్టీ అభ్యర్థులకు అంతు చిక్కక టెన్షన్ లో పడి కొట్టుకుంటున్నారు.
ప్రజల్లో పేరుకుంటున్న అసమ్మతిని ఆ నాయకులు ఏదో లోలోపలి గులుగుడుగా భావిస్తున్నారు. కానీ ‘గులుగుడు’గా ఉన్న స్థితి దాటి ప్రజలు నిక్కచ్చిగా తమ నిర్ణయం ఏమిటో తెలపడానికి నిశ్చయించుకున్న తర్వాత కానవచ్చే గంభీర మౌనం తెలంగాణ రాష్ట్రమంతా వినిపిస్తోంది. కొందరు రాజకీయ నాయకుల జీవితం ఎక్కడ ప్రారంభం అయిందో అక్కడే ముగింపు పలకడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జిల్లా రాజకీయాలపై పట్టున్న వారంతా ముక్తకంఠంతో అంచనా వేస్తున్న విషయం.
వెరసి పందెం రాయుళ్లు చెలరేగిపోతున్నారు. పెద్ద ఎత్తున గెలుపు గుర్రాలపై పందేలు కాస్తూ జిల్లా రాజకీయాలపై బెట్టింగ్ లు కాస్తుండటం విశేషం.