ఉక్రెయిన్ లో కాల్పులను తాత్కాలికంగా ఆపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో రెండు రోజులపాటు రష్యా కాల్పుల విరమణ ప్రకటించినట్టైంది. ఇరు దేశాల్లోనూ పవిత్ర క్రిస్ట్మస్ పండుగ సంబరాల్లో భాగంగా ఈ కాల్పుల విరమణను ప్రకటించారు. ఈమేరకు 76 ఏళ్ల మత పెద్ద పేట్రియార్క్ కిరిల్ ఇరు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించాక మొట్టమొదటిసారి పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను ప్రకటించింది రష్యా. చర్చ్ సర్వీసులకు హాజరయ్యే అవకాశం ఇరు దేశాల్లోని అందరికి కల్పించటమే కాల్పుల విరమణ వెనకున్న ప్రధాన ఉద్దేశం.
Russia-Ukraine war: ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES