Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలు5 Crores in Kondapur seized: కొండాపూర్ లో ఐదు కోట్ల నగదు సీజ్

5 Crores in Kondapur seized: కొండాపూర్ లో ఐదు కోట్ల నగదు సీజ్

ఎన్నికల సందర్భంగా నిరంతరం తనిఖీలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొండాపూర్ లో గల చిరక్ పబ్లిక్ స్కూల్ సమీపంలో పోలీసులు 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున తెల్లరంగు మారుతి బ్రీజా కారులో (TS 02EY 2678) ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఐదు కోట్ల నగదుతో ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా నిరంతరం పోలీసులు కొనసాగిస్తున్న తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం కూడా పోలీసులు కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు చూపించకుండా ముగ్గురు వ్యక్తులు సంతోష్, సంపత్, నరేష్ లు ఐదు కోట్ల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ ఐదు కోట్ల నగదును పోలీసులు ఐటి శాఖ అధికారులకు అప్పగించారు. సైబరాబాద్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News