Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Burberry: రాహుల్ టీ షర్ట్ సీక్రెట్స్ ఇవే

Burberry: రాహుల్ టీ షర్ట్ సీక్రెట్స్ ఇవే

రాహుల్ గాంధీకి బడా బ్రాండ్స్ బట్టలంటే చాలా క్రేజ్. ఆయన హాఫ్ జాకెట్ వేసినా, టీ షర్ట్ వేసినా, షూ, చప్పల్..ఇలా ఏది వేసినా చాలా లగ్జరీ బ్రాండ్స్ వేసుకుని తరచూ కనిపిస్తుంటారు. బర్బెర్రీ రాహుల్ ఫేవరెట్ బ్రాండ్ లా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలోనూ ఈయన..60,000 రూపాయల ఖరీదైన బర్బెరీ బ్రాండ్ జాకెట్ వేసుకుని తిరిగేవారు.

- Advertisement -

భారత్ జోడో యాత్రలో రాహుల్ వేసుకుని తిరుగుతున్న వైట్ కాలర్డ్ టీ షర్ట్ ధర 41,000 రూపాయలు. ఇది ఫ్యాషన్ జెయింట్ బర్బెరీ బ్రాండ్ టీ షర్ట్. లండన్ కు చెందిన హై ఎండ్ ఫ్యాషన్ హౌజ్ డిజైనర్ బ్రాండ్ గా దీనికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. హై క్వాలిటీ మెటీరియల్, క్రిస్ప్ ఫ్యాబ్రిక్ , మోడర్న్ కూల్ ఆపరెల్ గా ఇది ఫేమస్ అయింది. టాప్ బ్రిటీష్ బ్రాండ్ గా ఫ్యాషన్ లవర్స్ కు ఇప్పటికీ ఇదీ హాట్ ఫేవరెట్ బ్రాండ్. ప్రీమియం బ్రాండ్ గా ఉన్న బర్బెరీ క్లాంతింగ్ రేంజ్ కనీసం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. టీ షర్ట్స్, జాకెట్స్ వంటి బర్బెరీ బ్రాండ్ క్లాతింగ్ మినిమం 20,000 కాగా గరిష్టంగా లక్షల రూపాయాల్లో ఒక్కొక్క షర్ట్ ధర ఉంది.

రాహుల్ వేసుకునే ఈ టీ షర్ట్ లు ఎలాంటి విపత్కరమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా అద్భుతంగా మన శరీరాన్ని కాపాడతాయి. అంత అత్యున్నత నాణ్యత కలిగిన వస్త్రం కాబట్టే రాహుల్ చలి, ఎండలో కూడా కూల్ గా నడవగలుగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News