బండిఆత్మకూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో వెలసిన ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటైన శ్రీ గంగా ఉమాసమేత ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానములో పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం రెండవ సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్బంగా శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ విశ్వనాథరెడ్డి ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగప్రసాద్ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి వారి సతీమణి బుడ్డా శైలజలు శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ విశ్వనాథరెడ్డి ఆలయ అధికారి నాగప్రసాద్ లు బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదములు అందజేశారు. తరువాత బుడ్డా దంపతులు అన్నపూర్ణాదేవిని, కాశిరెడ్డి నాయన ఆశ్రయాన్ని దర్శించుకున్నారు.
కాశిరెడ్డి నాయన ఆశ్రమ నిర్వాహకులు నాగేశ్వర్ రెడ్డి బుడ్డాదంపతులను ఘనంగా సత్కరించారు. అన్నపూర్ణాదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు మండల కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి, కంచర్ల సురేష్ రెడ్డి, అల్లె ఈశ్వర రెడ్డి, బైరెడ్డి సుబ్బారెడ్డి, జాకీర్ ఖాన్, మనోహర్ చౌదరి, సోమయాజుల పల్లె మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి,నానుగొండ కృష్ణారెడ్డి పెద్దదేవళాపురం సర్పంచ్ పెద్దినేని పెద్దన్న, డిష్ రామలింగం, అదికొండ ప్రసాద్ సంతజూటూరు సర్పంచి యలగల రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.