తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా మూగబోయింది. పోలింగ్ కు 48 గంటలకు ముందే ప్రచారం ముగిసింది. 48 గంటల ముందు, మంగళవారం సాయంత్రం నాటికి అన్ని జిల్లాల్లో ఇతర జిల్లాలకు చెందిన వారు వెళ్లిపోవాలి. పోస్టల్ ఓటింగ్ చేపట్టి, ఎన్నికల విధుల సిబ్బందికి ఓటుహక్కు వినియోగానికి చర్యలు ఈసీ తీసుకుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేసింది ఈసీ. ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా చేయాలి.
డ్రై డే సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి అన్ని వైన్ షాపులు మూసేశారు. జిల్లాలో బయటి వ్యక్తులు ఉండడానికి వీలులేదు. 29 లోగా వాహనాల పాసులు తీసుకోవాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వ్యక్తులు, నేతలు అందరూ పాటించాల్సిందే.