Tuesday, October 8, 2024
Homeనేరాలు-ఘోరాలు400 hrs 17 days 41 people: కాసేపట్లో ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటికిరానున్న కూలీల

400 hrs 17 days 41 people: కాసేపట్లో ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటికిరానున్న కూలీల

మరికాసేపట్లో బయటికి

గత 17 రోజులుగా ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటికి వచ్చే అవకాశం ఉంది. మరో 2 మీటర్ల దూరంలో రెస్క్యూ ఆపరేషన్స్ సాగుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్ల ఆధ్వర్యంలో తవ్వకాలను జాగ్రత్తగా చేపడుతున్నారు. 2 మీటర్ల వరకు ఇక సొరంగం తవ్వకాలున్నాయని, ఈ పని పూర్తికాగానే ముందు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లి ఆతరువాత కూలీలను బయటికి తీసుకురానున్నారు. ఇప్పటికే కూలీల కుటుంబ సభ్యులను ఇక్కడికి రప్పించారు. హెలిక్యాప్టర్లను అందుబాటులో పెట్టారు. తాత్కాలిక ఆసుపత్రిని టన్నెల్ వద్దనే ఏర్పాటు చేశారు. 400 గంటలకుపైగా కూలీలు చిక్కుకుపోయారు. వీరు సురక్షితంగా బయటికి రావాలని పూజలు సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News