చేవెళ్ల నియోజకవర్గం ఉత్కంఠ పోరులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం హిమాయత్ సాగర్ విలేజ్ లోని లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 22 రౌండ్లో జరిగిన ఓట్ల లెక్కింపులో 9 రౌండ్ల వరకు ముందంజలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి పదో రౌండ్ నుండి 19 రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీమ్ భరత్ లీడ్ లో ఉన్నాడు. 20వ రౌండ్ వచ్చేసరికి బిఅర్ఎస్ అభ్యర్ధికి 70.982 ఓట్ల పోలయ్యాయి.1266 ఓట్ల మెజారిటీ ఆదిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 69.716 ఓట్లు పోలయ్యాయి. 22 రౌండ్లు ముగిసేసరికి బిఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య 268 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
22 రౌండ్లు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కౌంటింగ్ హాల్ వదిలి బయటకు వచ్చారు. అనంతరం తిరిగి వెళ్లి 5 వివిఎం కార్డులపై అభ్యతరం తెలిపి ఆ ఐదు ఈవియం ప్యాడ్స్ రీకౌంటింగ్ చేయమని కోరారు. శంకర్ పల్లి మండలం గాజులగూడ గ్రామం 1 మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ 4 ఈవిఎం రీకౌంటింగ్ చేశారు. కౌంటింగ్ లో ఎలాంటి మార్పు లేకపోవడంతో అధికారులు బిఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు చేవెళ్ల అసెంబ్లీ ఎమ్మెల్యే గా ధృవీకరణ పత్రం అందజేశారు.
గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మొదటగా గెలిచినప్పుడు మ్యాజిక్ సంఖ్య 7తో గెలుపొందిన, మూడోసారి 268 మ్యాజిక్స్ సంఖ్య 7తోనె గెలుపొందాను. ఇది ఆ ఏడుకొండలు వెంకటేశ్వరుని ఆశీర్వాదమే అన్నారు.