కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే… చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే… ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు. తనను ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇకనైనా హిందూ సమాజమంతా ఆలోచించుకోవాలని సూచించారు. ఈరోజు సాయంత్రం ఫలితాలు వెలువడిన అనంతరం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోస పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు పోరాడింది బీజేపీ…. లాభపడింది కాంగ్రెస్. ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడినం. నాతోపాటు ఎంతోమంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. దాడులు చేశారు. జైలుకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు… దురద్రుష్టవశాత్తు ప్రజలు మమ్ముల్ని ఆదరించలేదు… అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లు మీడియాకు విలువ ఇవ్వలేదు… అహంకారంతో విర్రవీగిండు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడ లేని గౌరవం ఇస్తుండు… కరీంనగర్ విషయానికొచ్చే సరికి ప్రతిసారి నా మెజారిటీ పెరుగుతూ వస్తోంది. దురద్రుష్టవశాత్తు ముస్లింలంతా ఒక్కటయ్యారు. ఎంఐఎంను చూస్తే థూ అన్పిస్తోంది. మీ భూములు కబ్జా చేసినోడికి, మీ తురకోళ్ల ఇండ్లు కూల్చినోడికి ఓటేస్తారా? బండి సంజయ్ ను ఓడగొట్టడమే మీ లక్ష్యమా? మీ నిజాయితీ ఏందో ఆలోచించాలి. వక్ఫ్ బోర్డు భూములను చెరబట్టినోళ్లను, ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లను గెలిపించారంటే ఆలోచించాలి. అదే సమయంలో హిందూ ధర్మం కోసం పోరాడిన బండి సంజయ్ విషయంలో ఒక వర్గం అంతా ఒక్కటైన తరువాత కూడా హిందూ సమాజం ఏమనుకుంటోంది? వాళ్లకే వదిలేస్తున్నా.. నేను ఫిర్యాదు చేసే వరకు 43, 289 పోలింగ్ బూత్ లలో ఓట్లు లెక్కించనేలేదు. అట్లాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫస్ట్ అయినా చేయాలి.. లేదా? చివర్లో అయినా చెప్పాలి. కానీ విచిత్రంగా మధ్యలో ఎట్లా లెక్కిస్తారు. బండి సంజయ్ గెలుపోటముల ఆధారంగా పనిచేయడు.. గెలిచినా, ఓడినా పనిచేస్తా… నా లక్ష్యం బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీ సీట్లు సాధించిన రేవంత్ రెడ్డికి నా అభినందనలు… కేసీఆర్ కు నేను, రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్. మా ఇద్దరిని ఎట్లా ఇబ్బంది పెట్టారో తెలుసు.. ఏదైమైనా విజయం సాధించిన కాంగ్రెస్ కు నా శుభాకాంక్షలు. నా కోసం, బీజేపీ కోసం నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బు ఆఫర్ చేసినా పార్టీని వీడలేదు… బీఆర్ఎస్ అభ్యర్ధి రూ. 200 కోట్లు ఖర్చు చేసిండు… పైగా నేను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారు.. డబ్బు, అధికారం, అంగబలంతో గెలిచారు. నేను ధర్మం కోసం పనిచేసే ధర్మ రక్షుకుడిని. నన్ను ఓడగొట్టేదాకా వెంటబడ్డరు. ఓడగట్టారు… అయినా బండి సంజయ్ కు పోయేదేముంది? గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటా… ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా… బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేశారు… ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి లాభపడాలని చూశారు.. కానీ చివరకు ఏమైంది బీఆర్ఎస్ ఓడింది.
Bandi Sanjay: నన్ను ఓడగొట్టేదాకా మా పార్టీ వాళ్లే వెంటపడ్డారు
కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు అభినందనలు