తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి నిస్వార్థ సేవకురాలిగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకటరెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ లు అన్నారు. సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.
అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో బలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగాలను గుర్తించిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాల నుంచి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా.. సోనియా గాంధీ వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల ఆకాంక్షను ఆమె నెరవేర్చారన్నారు. దానికి కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని
సోనియా గాంధీ జన్మదినం రోజునే తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా రూ.10 లక్షల వైద్య సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజామోద్యమైన జనరంజక పాలన కొనసాగుతుందన్నారు.
అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రజల దీవెనలతో తల్లి సోనియమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బన్సిలాల్ ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ బాపనపల్లి సుందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ హథిరాం మీరా రవి నాయక్ ఇమ్రాన్ కోల కుమార్ వీరస్వామి రాజశేఖర్ నాగరాజు పాషా ఐలయ్య మహిళా నాయకురాలు గంగ వినోద తదితరులు పాల్గొన్నారు.