చైనా మంజాపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల రాళ్ల వాగు బ్రిడ్జిపై మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తి చైనా మాంజా గొంతుకు తగిలి బలి కావడం జిల్లా ప్రజలను తీవ్ర శోకంలోకి నెట్టివేసింది. ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలపై అకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజా విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
పండగ సందర్భంగా గాలి పటాలు ఎగరేవసేందుకు ఉపయోగించే నైలన్, సింథటిక్, మాంజా, చైనీస్ మాంజా వాడకం వల్ల అనర్థాలపై అందరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. చైనా మాంజా ద్వారా పర్యావరణం, పక్షులకు హాని కలుగుతోన్నందున కేంద్ర పర్యావరణ చట్ట ప్రకారం చైనీస్ మాంజా వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించిందినట్లు తెలిపారు. చైనా మాంజా అమ్మినా, నిలువ ఉంచిన, ఉపయోగించిన, రవాణ చేసిన వారికి ఐదేళ్లు జైలు శిక్షతో పాటు సుమారు లక్ష రూపాయల వరకు జరిమాణ విధించడం జరుగుతోందని తెలిపారు. మాంజా ఉపయోగించిన వారి ద్వారా పక్షులకు గాని మనుషులకు హాని జరిగిట్లు తెలిస్తే మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష రూ. పదివేల జరిమాణ విధించనున్నట్లు తెలిపారు. చైనా మాంజా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసిన వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.