Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్TDP: సైకో పోవాలి..సైకిల్ రావాలి..బనగానపల్లె టీడీపీ ప్రచారం

TDP: సైకో పోవాలి..సైకిల్ రావాలి..బనగానపల్లె టీడీపీ ప్రచారం

రాష్ట్రానికి పూర్వ వైభవం, పేద , బలహీన వర్గాలలో వెలుగు నింపాలంటే సైకో పాలన పోయి..సైకిల్ పాలన రావాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో “సైకో పోవాలి సైకిల్ రావాలి” అని నినాదంతో ఉన్న టీ షర్టులను విడుదల చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం సర్వ నాశనం అయిందని అన్నారు. సైకో ముఖ్యమంత్రి వల్ల ఈ మూడున్నర సంవత్సరాల లో రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెనక్కి పోయయాని ఆయన ఆరోపించారు. సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి జిఓ నెంబర్ 1 తెచ్చి ..ప్రజల హక్కులను, రాజకీయ నాయకుల హక్కులను కాల రాస్తున్నారని జనార్ధన్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News