Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan reviewed Covid new variant situation: కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై సీఎం జగన్‌...

Jagan reviewed Covid new variant situation: కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై సీఎం జగన్‌ సమీక్ష విజువల్స్.

ఆందోళన అవసరం లేదన్న అధికారులు

కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

- Advertisement -

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ డాక్టర్ డీఎస్‌వీఎల్‌ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలన్న సీఎం.

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.
జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు.
ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు.
ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వెల్లడి.
డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.
అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరణ.
లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని వెల్లడి.
పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వెల్లడి.
కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని వెల్లడి.
గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నామన్న అధికారులు.
అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడి.
అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడి.
ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని వెల్లడి.
పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడి.
అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశామని వెల్లడి.
56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడి.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…
ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారు:
ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలి:
అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలి :
కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలి: సీఎం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News