Monday, November 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలంలో బ్రహ్మోత్సవ కల్యాణం, చెంచు భక్తులకు ప్రత్యేక ఆహ్వానం

Srisailam: శ్రీశైలంలో బ్రహ్మోత్సవ కల్యాణం, చెంచు భక్తులకు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైల మహాక్షేత్రములో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వతేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం చేస్తారు. ఈసందర్భంగా చెంచు భక్తులకు ప్రత్యేక ఆహ్వానం పలికింది శ్రీశైలం దేవస్థానం. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచు భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ చెంచులు శ్రీశైల భ్రమరాంబను తమ కూతురిగా శ్రీ మల్లికార్జునస్వామి వారిని తమ అల్లునిగా భావిస్తారు. స్వామివారిని చెంచు మల్లన్న, చెంచు మల్లయ్య అని ఆప్యాయంగా చెంచులు పిలుచుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News