Friday, November 22, 2024
Homeహెల్త్Avocado for skin: చర్మాన్ని మెరిపించే అవకెడో

Avocado for skin: చర్మాన్ని మెరిపించే అవకెడో

అవకెడో పండు …దీన్ని జస్ట్ ఫ్రూట్ అనడం కన్నా అందాన్ని ఇనుమడించే అందులోనూ చర్మ సౌందర్యాన్ని మెరిపించే సంజీవనీ లాంటి పండు అనాలి. సాధారణంగా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి సప్లిమెంట్ వాడాలంటారు సౌందర్యనిపుణులు. ఈ విషయంలో అవకెడో సహజసిద్ధమైన బ్యూటీ సప్లిమెంటు అని కూడా వీళ్లు కితాబిస్తున్నారు.

- Advertisement -


అవకెడోల నుంచి లభించే నూనె చర్మన్ని అందంగా మెరిపిస్తుంది. అవకెడోలోని పోషకపదార్థాలు చర్మాన్ని పట్టులా కనిపించేలా చేస్తాయి. ఈ పండులో విటమిన్ ఎ, డి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందజేస్తాయి. అంతేకాదు ఈ పండులోని లినోలిక్, ఓలెక్ యాసిడ్లు చర్మాన్ని బిగువుగా, మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందివ్వడమే కాకుండా శరీరంలోని వాపును సైతం ఈ పండ్లు పోగొడతాయి.

సొరియాసిస్, దద్దుర్లు వంటి చర్మ సమస్యల వల్ల ఇన్ఫ్లమేషన్ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి అవకెడోలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా అవకెడో నూనె ఇన్ఫ్లమేషన్ సమస్యలను శక్తివంతంగా పరిష్కరిస్తుంది. అవకెడో నుంచి తీసిన అవకెడో పెర్సియోసె చిన్నారుల సెల్యులార్ సంపదను పరిరక్షిస్తుంది. చర్మం దెబ్బతినకుండా కూడా అవకెడో సంరక్షిస్తుంది. సూర్యరశ్మి, అతినీలలోహిత కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ రేడియేషన్ దుష్ప్రభావం నుంచి అవకెడో లోని ల్యూటిన్, జక్సాస్థిన్ లు చర్మాన్ని పరిరక్షిస్తాయి. చర్మం ఎలాస్టిసిటీని కూడా అవకెడోలు సంరక్షిస్తాయి. అవకెడోలో ఆరోగ్యవంతమైన మొనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ బాగా ఉన్నాయి. ఇవి చర్మం ఎలాస్టిసిటీని పెంచుతాయి. చర్మానికి సాంత్వన నిచ్చే మరెన్నో పోషకాలు కూడా అవకెడోలో ఉన్నాయి. అవకెడో వినియోగం వల్ల చర్మం సంపూర్ణ ఆరోగ్యంతో మెరుపులు చిందిస్తుంది.

అంతేకాదు చర్మానికి అవసరమైన కొల్లాజెన్ లాంటి ఆరోగ్యకరమైన కారకాలను కూడా అవకెడో పెంచుతుంది. అవకెడోలో బయొటిన్ అనే బికాంప్లెక్స్ కారకం కూడా ఉంది. అందుకే అవకెడో నూనెలోని బయొటిన్ పొడిచర్మాన్ని నివారిస్తుంది. అవకెడో నుంచి తీసిన పదార్థాలు చర్మానికి కావలసిన హైడ్రేటింగ్ ను అందజేయడమే కాకుండా దురద వంటివి తగ్గిస్తూ ఎగ్జిమా నుంచి సాంత్వననిస్తాయి. అవకెడోలోని ఆయిల్స్ యాక్నేను నివారిస్తాయి. ఇవి చర్మంపై తలెత్తే ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని నివారిస్తాయి. బ్రేకవుట్లను నిరోధిస్తాయి. అవకెడోల్లో యాంటిమైక్రోబియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని లూరిక్ యాసిడ్ క్లీన్సర్ గా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం బాగా పొడిబారితే పొట్టు ఊడిపోతుంది. ముఖ్యంగా నవజాతశిశువుల్లో చర్మం ఊడిపోవడం చూస్తాం. అవకెడో ఆయిల్ చర్మానికి పట్టివ్వడం వల్ల చర్మానికి కావలసిన హైడ్రేషన్ అందడమే కాదు చర్మానికి ఎంతో సాంత్వన కూడా ఇస్తుంది.

అవకెడో ఉత్పత్తులు సహజసిద్ధమైన చర్మం ఎక్స్ ఫొయిలేటర్స్ కూడా. పెద్దవాళ్లతోపాటు చిన్నారుల చర్మానికి సైతం అవకెడో నూనె ఎంతో బాగా పని చేస్తుంది. మృతకణాలను పోగొడుతుంది. అంతేకాదు అవకెడో ఉత్పత్తులు చర్మాన్ని మెరిపించడంతో పాటు ఆరోగ్యవంతంగా చేస్తాయి. సన్ బర్న్స్ నుంచి అవకెడో ఆయిల్ సాంత్వననిస్తుంది. దెబ్బతిన్న చర్మంలో తేమను పెంపొందించి, చర్మానికి ఆయిల్ పొరను రక్షణగా ఉంచుతుంది. చర్మానికి సాంత్వననిస్తుంది. చుండ్రు, పొడిబారిన మాడు సమస్యల నుంచి కూడా అవకెడో ఉపశమనాన్ని ఇస్తుంది.

చర్మం పొడిబారే గుణాన్ని పోగొట్టి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శుభ్రంగా, ఆరోగ్యంగా మాడు ఉండేలా తోడ్పడుతుంది. అవకెడోలోని పోషకాలు, యాంటాక్సిడెంట్లు, యాంటిఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు చర్మాన్ని యంగ్ గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేషన్ మీద ఒలిక్ యాసిడ్ ఎంతో శక్తివంతంగా పోరాడుతుంది. అంతేకాదు చర్మం ముడతలు పడకుండా నిరోధిస్తుంది. ఇందులోని విటమిన్ సి చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలు, ముడతలను కూడా పోగొడుతుంది. అవకెడోలోని యాంటాక్సిడెంట్లు డిఎన్ఎ ను కాపాడతాయి. హెల్దీ ఏజింగ్ ఉండేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News