Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుIllanthakunta: బెల్ట్ తీసుడే..

Illanthakunta: బెల్ట్ తీసుడే..

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ సుధాకర్

ఇల్లంతకుంట మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపు పైన కేసు నమోదు చేశామని ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. మండలంలోని దాచారం గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తూ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మద్యాన్ని అమ్ముతున్న గౌరవేని రమేష్ షాపులో నుండి 27 బీర్ బాటిళ్లు, 8.5 లీటర్ల మద్యం సీజ్ చేసి అతనిపైన కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఎవరైనా మద్యాన్ని విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొందిన వైన్ షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అటువంటి వారి సమాచారాన్ని పోలీసువారికి అందించాలని కోరారు. అక్రమ మద్యాన్ని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ లు సత్యనారాయణ, భూమయ్య, కానిస్టేబుల్ లు తిరుపతి, చంద్రశేఖర్, శ్రీకాంత్ లను ఎస్సై అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News