తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (HCCB) కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సెక్రెటేరియట్‌లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ కంపెనీ దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది.
తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యం అవుతుందని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (హెచ్‌సీసీబీ) పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శని, కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.