Sunday, December 8, 2024
Homeట్రేడింగ్Revanth Reddy with HCCB: రేవంత్ తో కోకో కోలా బేవరేజెస్ చర్చలు

Revanth Reddy with HCCB: రేవంత్ తో కోకో కోలా బేవరేజెస్ చర్చలు

అభివృద్ధిలో పాలుపంచుకుంటాం

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు హిందుస్థాన్​ కోకో కోలా బెవెరేజెస్​ (HCCB) కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సెక్రెటేరియట్​లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్​రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ కంపెనీ దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్​లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్​ ఫీల్డ్ ​ ప్లాంట్​ నిర్మాణంలో ఉంది.

- Advertisement -

తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యం అవుతుందని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ విధానం అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. హిందుస్థాన్​ కోకో కోలా బెవెరేజెస్​ (హెచ్​సీసీబీ) పబ్లిక్​ అఫైర్స్​ చీఫ్​ హిమాన్షు ప్రియదర్శని, కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News