Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: రిమాండుకు కార్పొరేటర్ జంగిలి సాగర్

Karimnagar: రిమాండుకు కార్పొరేటర్ జంగిలి సాగర్

21వ డివిజన్ (సీతారాంపూర్ ) కార్పొరేటర్ భూకబ్జాకు పాల్పడిన కేసులో..

కరీంనగర్ లోని సూర్యనగర్ సీతారాంపూర్ కి చెందిన తాటిపల్లి లింగారెడ్డి, తండ్రి; కిష్టారెడ్డి, వయసు 61, వృత్తి : పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయునికి చెందిన సర్వే నెంబర్ 68/B లో 24.5 గుంటల భూమి కలిగి ఉన్నాడు. కాగా ఆ ఏరియాకి చెందిన కరీంనగర్ 21వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ జంగిలి సాగర్ లింగారెడ్డిని పలుమార్లు ఇంటికి పిలిచి నీవు కొన్న భూమి అతి తక్కువ ధరలో కొన్నావు, ఇప్పుడు ఆ భూమి ధర చాలా పెరిగిందని దానికి గాను 40,00,000 ఇవ్వాలని లేదా నాలుగు గుంటల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని లేదంటే ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలను జరగకుండా చూస్తానని గత రెండు సంవత్సరాలుగా బెదిరిస్తున్నాడని, ఆ స్థలంలో అపార్టుమెంటు నిర్మాణానికి బిల్డర్ కి అప్పగించినప్పటికీ వారిని సైతం బెదిరింపులకు గురిచేస్తూ నిర్మాణం జరగకుండా చూశాడని, కార్పొరేటర్ అడిగినంత డబ్బు లేదా నాలుగు గుంటల భూమి ఇవ్వనందున అక్రమంగా తన సొంత భూమిలో రోడ్ నిర్మాణం చేపట్టడం, డ్రైనేజీ వాటర్ ని , పై భూమిలోకి మళ్లించడం వంటి పనులు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు తెలిపాడు. తాను కష్టపడి సంపాదించి, పదవి విరమణ పొందగా వచ్చిన డబ్బులో నుండి కార్పొరేటర్ జంగిలి సాగర్ పెట్టే ఇబ్బందులకు తట్టుకోలేక 10 లక్షల రూపాయలను ముట్టచెప్పినప్పటికీ కొద్ది రోజులు మౌనం వహించి తిరిగి మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని వేధించాడని అంతేకాకుండా నిర్మాణంలో వున్న అపార్ట్మెంట్ ని అక్రమంగా చొరబడి నిర్మాణ పనులు అడ్డుకునే చర్యలకు పాల్పడ్డాడని, ప్రస్తుతం కూడా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడని తాటిపల్లి లింగారెడ్డి ఈ నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో 21 వ డివిజన్ కార్పొరేటర్ పై చర్యలకు పాల్పడ్డాడని, డౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసాడని విచారణలో తేలింది. ఈ విచారణ కరీంనగర్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పాటైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సహాయంతో కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ముద్దాయి పై చర్యలకు పాల్పడ్డారని తేలినందున కొత్తపల్లి ఎస్సై చంద్రశేఖర్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి (Cr. No. 31/2023 u/s, 447, 427, 386,506 IPC) అరెస్ట్ చేసి కరీంనగర్ ఫస్ట్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో హాజరు పరచగా గౌరవ న్యాయమూర్తి కేసుపూర్వ పరాలు పరశీలించి ముద్దాయికి ఫిబ్రవరి 6వ తేది వరకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇట్టి కేసుపై విచారణ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

21 వ డివిజన్ కార్పొరేటర్ అయిన జంగిల్ సాగర్ పై గతంలో కూడా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా ప్రభుత్వ భూమిలో చొరబడి అక్రమంగా గణేశుడు విగ్రహం మరియు టెంట్లు ఏర్పాటు చేశాడని A) Cr. No. 515/2011 u/sec 447, 186 r/w 34 IPC కేసు మరియు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో

B) ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేశాడని Cr. No. 90/2022 U/SEC 427, 290, 324, r/w 34IPC, జంగిల్ సాగర్ మరియు అతని అనుచరులు కలిసి నిర్మాణంలో ఉన్నటువంటి ఇతరుల యొక్క ఇంటిని కూల్చివేసిన C) Cr. No. 164/2022 U/Sec 147,148, 452, 427, r/w 149 IPC రెండు కేసులు నమోదు అయ్యాయని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News