Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur: ఇన్వెస్ట్మెంట్ పేరు చెప్పి వేలు దోచేసిన కేటుగాళ్లు

Tandur: ఇన్వెస్ట్మెంట్ పేరు చెప్పి వేలు దోచేసిన కేటుగాళ్లు

అడ్వర్టైజ్మెంట్ ను చూసి మోసపోయారు

అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి సైబర్ చీటింగ్స్ కు పాల్పడుతున్నా మోసగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నామని అనుకున్నా.. వారి బుట్టలో పడకుండా జనం ఉండలేకపోతున్నారు. అమాయకుల నుండి పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు. వికారాబాద్ జిల్లాలో పెద్దేముల్ మండల పరిధిలో ఇద్దరు యువకులు ఆన్లైన్ మోసానికి గురైన సంఘటన…. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

పెద్దేముల్ ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని మరేపల్లి తండాకు చెందిన బి.ప్రవీణ్ కుమార్, మన్ సాన్ పల్లి తండాకు చెందిన శ్రీనులు ఫేస్ బుక్ లో జనరేటర్ అడ్వర్టైజ్మెంట్ ను చూసి తమ వ్యాపారానికి ఉపయోగపడుతుందని చూసి రూ.1,60,000/- లను పుణెకు చెందిన మనీష్ రమాకాంత్ దుర్వే అనే పేరుతో ఉన్న వ్యక్తితో జనరేటర్ బేరం కుదిరించుకొని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. తమకు కావాల్సిన జనరేటర్ రాకపోవడంతో కంగుతిన్న యువకులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News