హైదరాబాద్ లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానశ్రయానికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. సాంకేతిక వినియోగంలో ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డు జీఎంఆర్ విమానాశ్రయం సొంతం చేసుకుంది. అసోచామ్14వ అంతర్జాతీయ వార్షిక కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్స్ – సివిల్ ఏవియేషన్ 2023 లో భాగంగా ఈ అవార్డును అందజేశారు. హైదరాబాద్ విమానాశ్రయం పటిష్టమైన భద్రతకు భరోసానిస్తూ ప్రయాణీకుల అనుభవాన్ని, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి వినూత్న సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడంలో ముందంజలో ఉంది. ఇది దేశంలోని విమానాశ్రయ రంగంలో పలు మొట్టమొదటి సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలికింది. ఇంటిగ్రేటెడ్-సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (AOCC), E-బోర్డింగ్ సొల్యూషన్, ఎక్స్‌ప్రెస్ చెక్-ఇన్, కెమెరా ఆధారిత కాంటాక్ట్‌లెస్ టెర్మినల్ ఎంట్రీ, ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ATRS), IoTఆధారిత స్మార్ట్ ట్రాలీ మేనేజ్మెంట్, AI ఆధారిత ప్యాసింజర్ ఫ్లో మేనేజ్మెంట్, కాంటాక్ట్‌లెస్ CUSS (కామన్ యూజ్ సెల్ఫ్ సర్వీస్), వర్చువల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ డెస్క్ లాంటి ఇంకెన్నో సేవలను తొలుత జీఎంఆర్ ప్రారంభించింది. విమానాశ్రయాలలో ఆవిష్కరణలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేస్తారు.
Hyd: ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్’ గా GMR హైదరాబాద్ విమానాశ్రయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES