Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Indian Middle class: మధ్యతరగతి మాటేమిటి?

Indian Middle class: మధ్యతరగతి మాటేమిటి?

దేశంలో బాగా నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గమేదైనా ఉందా అంటే అది మధ్య తరగతి వర్గమే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మధ్య తరగతి వర్గం వివక్షకు గురవుతూనే ఉంది. మధ్య యుగపు విధానం ప్రకారం, సంపన్నులను దోచి పేదలకు పెట్టడం. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం మధ్యతరగతిని దోచి సంపన్ను లకు, పేదలకు పెట్టడం. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు బడ్జెట్‌ ప్రస్తావన వచ్చినా స్వాతి చినుకు కోసం ఎదురు చూసే చేతక పక్షిలా మధ్యతరగతి తమకేదైనా మేలు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటుంది. ఇలా 75 ఏళ్లుగా ఎదురు చూడడం తోనే సరిపోతోంది. మధ్యతరగతిని ఎంత బాగా దోస్తే దేశం అంతగా అభివృద్ధి చెంది నట్టు. ఎంతగా పీల్చి పిప్పిచేస్తే జీడీపీ అంతగా పెరిగినట్టు. పన్నులు కట్టేది మధ్య తరగతే. అధిక ధరలను భరించేది మధ్యతరగతే. బడ్జెట్‌ వస్తోందంటే చాలు, మధ్య తరగతిలో పన్నుల భయం పట్టుకుంటుంది. పన్నుల శ్లాబ్‌ మీద ఆశలు పెట్టుకుం టుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తాను మధ్యతరగతికి చెందిన వ్యక్తినని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మధ్యతరగతి మీద అదనపు పన్నుల భారం ఉండబోదని ఆమె ఇటీవల ప్రకటించినప్పుడు మధ్యతరగతి దాదాపు సంబరాలు జరుపుకుంది.
దేశంలో పన్నుల విస్తృతి చాలా చిన్నది. అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు ఎక్కువగా మధ్యతరగతి మీదే ఆధారపడుతుంటాయి. మధ్యతరగతి ద్వారానే గరిష్టం గా పన్ను ఆదాయం సమకూరుతుంటుంది. అందువల్ల బడ్జెట్‌కు సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా మధ్యతరగతి గాభరా పడుతుంటుంది. ఈ మధ్యతరగతి వర్గం ఎంత విస్తృతమైనదో ఒకపట్టాన అంచనా వేయలేం. సాలీనా రూ. 5.30 లక్షలు సంపాదించే వారంతా మధ్యతరగతికి చెందినవారేనని ‘ప్రెస్‌’ అనే ఆర్థిక వ్యవహారాల అధ్యయన సంస్థ నిర్వచనం చెప్పింది. దాని ప్రకారం, దేశంలో 30 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవేనని కూడా అది తేల్చింది. 2018-19 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5.60 కోట్ల మంది వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయగా, అందులో కోటీ 90 లక్షల మంది అంటే 34 శాతం మంది రూ. 5.25 లక్షల లోపు ఆదాయం కలిగినవారేనని తేలింది. దీని ప్రకారం దేశంలో పన్నుల వ్యవస్థ ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దేశంలో అసలు సిసలు కొనుగోలుదారుల గణాంకాలను సేకరించినప్పుడు, దాదాపు ఇదే సంఖ్యలో మధ్యతరగతి కొనుగోలు దారులున్నారని అర్థమైంది. అంటే, దేశంలో ఏ వస్తువునైనా ఎక్కువగా కొనుగోలు చేసేది మధ్యతరగతేనన్న మాట.
సొంతన లేని గణాంకాలు
ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి మీద పన్నుల భారం వేయమని చెప్పిన నిర్మలా సీతారామన్‌, ప్రాథమిక సదుపాయాల కల్పన మీదే దృష్టి కేంద్రీకరించడం జరుగు తుందని, వీటి అభివృద్ధి మీదే భారీగా పెట్టుబడి పెట్టబోతున్నామని ప్రకటించారు. నిజానికి ప్రాథమిక సదుపాయాల కల్పన అనేది మధ్యతరగతికి పెద్దగా ప్రయోజనం కలిగించే అంశమేమీ కాదు. అది తమ జీవన స్థితిగతులను, జీవిత నాణ్యతను పెంచగ లదనే నమ్మకం తమకెప్పుడూ లేదని కూడా మధ్యతరగతి అభిప్రాయపడుతోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాల వల్ల మధ్యతరగతి ప్రత్యక్షంగా లబ్ధి పొం దుతుందే తప్ప ప్రాథమిక సదుపాయాల వల్ల కాదని అత్యధిక సంఖ్యాక మధ్య తరగతి ప్రజలు అభిప్రాయపడుతుంటారని గతంలో అనేక ధ్యయనాల్లో వెల్లడైంది. ఇటువంటి మౌలిక సౌకర్యాల మీద పెట్టే పెట్టుబడుల వల్లే గరిష్ఠంగా ప్రయోజనం ఉంటుందనే వారు భావిస్తున్నారు. అయితే, ఈ అభిప్రాయం మీద దేవేశ్‌ కపూర్‌ వంటి ఆర్థిక నిపుణ ఎలు ప్రతికూల సూచనలు అందజేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌక ర్యాల మీద ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు పెరిగితే, మధ్యతరగతి ప్రజలకు పన్నులు కట్టాలన్న ధ్యాస మరింత తగ్గుతుందని ఆయన హెచ్చరించారు.
మధ్యతరగతి ప్రజల జనాభా ఎంత ఉందన్నది సరైన గణాంకాలతో వెల్లడిం చాల్సిన అవసరం ఉందని కపూర్‌ తదితరులు భావిస్తున్నారు. తాము మధ్యతరగతికి చెందినవారమో, కాదో మధ్యతరగతివారే బయటపెట్టాలని ఆయన సూచించారు. విచిత్రమేమిటంటే, దేశంలో సగం జనాభా తాము మధ్యతరగతి అనే చెప్పుకుంటుం టుందని, అందువల్ల మధ్యతరగతి భాగస్వామ్యం గురించి సరైన మదింపు జరగ డం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా, పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలున్నట్టు గణాంకాలు తెలియజేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరిని మధ్యతరగతిగా నిర్ధారించాలో తెలియని అయోమయ పరిస్థితి దేశంలో నెలకొని ఉందని మరి కొందరు ఆర్థిక నిపుణులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాక, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ పాలకులు మధ్యతరగ తిని ఎక్కు వగా పట్టించుకోవు. గ్రామీణ ప్రాంత మధ్యతరగతి పైనే వారంతా శ్రద్ధ పెడుతుండడం మొదటి నుంచీ జరుగుతోంది. పట్టణ, నగర మధ్యతరగతి నుంచి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ. పైగా, ఇక్కడ రూ. 5 లక్షల ఆదాయాన్ని దాటి ముందుకు పోవడం కూ డా చాలా కష్టమైన వ్యవహారం. సరళీకరణ కారణంగా కాస్తో కూస్తో లబ్ధిపొందిన మధ్యతరగతి మరింత విస్తరిస్తే తప్ప దాని ప్రభావం గరిష్ఠ స్థాయిలో ఉండే అవకాశం లేదు. అంటే భారీ సంఖ్యలో పేద ప్రజలు మధ్యతరగతి స్థాయికి చేరవలసి ఉంటుంది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News