Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Modi once again: ఇదే 2024 ఎన్నికల్లో బీజేపీ నినాదం

Modi once again: ఇదే 2024 ఎన్నికల్లో బీజేపీ నినాదం

మోడీ మోడీ మోడీ..ఇది ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల నినాదం కానుంది. ఈమేరకు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పేరుతో చాలానే పోస్టర్లు, స్లోగన్, నినాదాలు, ప్లక్కార్డులు, స్టిక్కర్లు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కవితలు, ఫోటోలు, హ్యాష్ ట్యాగులు అప్పుడే వైరల్ అవ్వటం స్టార్ట్ అయింది. మోడీ వన్స్ ఎగైన్ అన్న హ్యాష్ ట్యాగ్ తో బీజేపీ అప్పుడు 2024 లోక్సభ ఎన్నికల పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. భారత్ ను సూపర్ పవర్ చేద్దాం, మోడీకి వోటు వేద్దాం అనే అర్థం స్ఫురించేలా ..చేయి చేయి కలపమని బీజేపీ అర్థిస్తున్నట్టు మెసేజెస్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టి..సరికొత్త చరిత్ర లిఖించేందుకు సర్వం ఒడ్డుతున్న మోడీ సేన ఈమేరకు అప్పుడే ప్రచార ఉధృతిని మొదలు పెట్టింది. మోడీ మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కలియ తిరుగుతుంటే మరోవైపు కోలకతా వంటి చోట్ల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా విస్తృత పర్యటనలు సాగిస్తున్నారు. అమిత్ షా కూడా ఎన్నికల మోడ్ లోకి వచ్చి.. మరోమారు పోల్ మెషిన్ అనే పేరును పార్టీకి సరిపోతుందని నిరూపించే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News