నాలుగేళ్ల వైసిపి పాలనలో అధికార పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవడం జరిగిందని, తాను గెలిపించిన వ్యక్తే దుష్ట రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ రాజకీయాలు చేసిన కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, నియోజవర్గ అభివృద్ధి పరమావధిగా సీఎం జగనన్న నాయకత్వంలో అభివృద్ధి పరచడం జరిగిందని ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. పట్టణంలోనే స్థానిక మార్కెట్ యార్డులో వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సమరానికి సిద్ధం, అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధార పరిచయ కార్యక్రమాన్ని వైయస్సార్సీపి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధార హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వైయస్సార్సీపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సమావేశంలో నియోజవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ దార మాట్లాడుతూ ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సీఎం జగనన్న ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో బాల్యం నుంచి డాక్టర్ స్థాయి వరకు తన జీవనమనగడ జరిగిందని నియోజవర్గ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు అండగా ఉంటానని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో నియోజవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఆశీర్వదించాలని ఆయన కార్యకర్తలను కోరారు. అనంతరం ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ నాడు ప్రజల ఆశీర్వాదంతో నియోజవర్గంలో తాను బలపరిచిన అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడం జరిగిందని, అయినా అధికార పార్టీలో ఉన్న ఎన్నో అవమానాలు, దుష్ట నాయకుల రాజకీయ కుతంత్రాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.
దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు, తాను గెలిపించిన అభ్యర్థి పక్క నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి ఇచ్చే పరిచయాలు పెంచుకొని, టిడిపి నాయకులను ఆదరించి కుట్రలకు పాల్పడిన ఏనాడు నియోజవర్గంలో ఎమ్మెల్యేకు ఇబ్బంది కనపరచలేదన్నారు. నిజమైన దళిత ద్రోహులు విమర్శించే వారెనని నాడు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఐజయ్య లను అవమానపరిచిన నాయకులు వారేనని పరోక్షంగా చురుకలు అంటించారు. నీతిమాలిన రాజకీయాలు తాను చేయనని నమ్మిన కార్యకర్తల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానే తప్ప మరొకటి చేయనున్నారు. ప్రజలకు వెళ్లవేల అందుబాటులో ఉంటూ నియోజవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తినని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జగనన్న సంక్షేమ పాలననే శ్రీరామ రక్షక భావించి ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళి కృష్ణారెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రహత్ జబ్బర్, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బేగ్, వైసిపి పట్టణ అధ్యక్షులు మన్సూర్, ఉమ్మడి జిల్లాల మైనార్టీ జోనల్ ఇంచార్జ్ అబుబుకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజ్ , వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బద్దుల శ్రీకాంత్, అబ్దుల్ జబ్బర్,వివిధ మండలాల జడ్పిటిసిలు పుల్యాల దివ్య, జగదీష్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి, సర్పంచు రవి యాదవ్ వివిధ మండలాల నాయకులు గ్రామ సర్పంచులు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.