Friday, November 22, 2024
HomeతెలంగాణCM Revanth on Nizam Sugar factory: నిజాం షుకర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిద్ధాం

CM Revanth on Nizam Sugar factory: నిజాం షుకర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిద్ధాం

ఏమేం చేయాలి, ఏయే మార్గాలు అనుసరించాలో చర్చ

రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్​ రెడ్డి, రోహిత్​ రావు, అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​, మాజీ ఎమ్మెల్యే ఏ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు.

మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు.

నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News