Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుDrugs: నా బూట్లలో 20 కోట్ల విలువైన కొకైన్ ఉంది

Drugs: నా బూట్లలో 20 కోట్ల విలువైన కొకైన్ ఉంది

అనగనగా ఓ కొకైన్ డీలర్ బ్రిటన్ లో కారులో వెళ్తున్నాడు.. పెట్రోలింగ్ పోలీసులు సోదాల్లో భాగంగా ఇతని కారు ఆపారు. నీదగ్గర ఏమైనా నిషేధిత వస్తువులున్నాయా అని అతన్ని అడిగారు. వెంటనే అతను నిజాయితీగా అవును.. నాదగ్గర 20 కోట్లకు పైగా విలువైన కొకైన్ ఉందన్నాడు. ఎక్కడుందని పోలీసులు అడిగారు.. నా బూట్లలో అని చెప్పాడు. ఖేల్ ఖతం. పోలీసులు అతని బూట్లు చెక్ చేస్తే నిజంగానే 19 కేజీల విలువైన కొకైన్ దొరికింది.

- Advertisement -

ఆతరువాత ఆయనపై పోలీసుల కేసు, కోర్టులో వాదలను సాగాయి. చివరికి అతనికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కిరన్ గ్రాంట్ అనే కొకైన్ డీలర్ చేసిన ఈ పని ఇప్పుడు వైరల్ గా మారింది. 40 ఏళ్ల గ్రాంట్ నిజాయితీ ప్రదర్శించటం అందరికీ షాక్ ఇస్తోంది. ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ కూడా ఉంటారా అని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News