బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్ లో మోడీ బంగారు విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ప్రధాని మోడీ ఫ్యాన్ అయిన బంగారు వ్యాపారి 156 గ్రాముల బంగారంతో ఈ విగ్రహం తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. గుజరాత్ కు చెందిన సందీప్ జైన్ మోడీ అభిమాని.. కాగా ఈమధ్యనే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లు గెలిచినందుకు గుర్తుగా ఇలా 156 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మోడీ విగ్రహాన్ని రూపొందించినట్టు స్వయంగా సందీప్ వివరిస్తున్నారు. దీంతో అభిమానం అంటే ఇదేరా.. బంగారు అభిమానం అంటూ నెటిజన్స్ తెగ మెచ్చుకుంటూ సందీప్ ను అభినందిస్తున్నారు.
ఇటు యూపీ సీఎం యోగి అదిత్యానాథ్ ఫ్యాన్స్ యోగికి గుడి కట్టి తమ అభిమానం చాటుకుంటున్నారు. అయోధ్యలోని కొందరు ముస్లింలు ఇలా గుడి కట్టి యోగిని ఆరాధిస్తుండటం హైలైట్. యోగికి వీరాభిమాని అయిన ప్రభాకర్ మౌర్య ఈ గుడిని నిర్మిస్తున్నాడు. వచ్చే నల 24న ఈ గుడి నిర్మాణం పనులు ప్రారంభమై 2027 నాటికి పూర్తి కానున్నాయి.