Monday, May 19, 2025
HomeతెలంగాణSrisailam: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 26 పులులు..చూడాలంటే గెస్ట్ హౌస్, సఫారీ రెడీ

Srisailam: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 26 పులులు..చూడాలంటే గెస్ట్ హౌస్, సఫారీ రెడీ

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటకులకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని.. రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచడంలో భాగంగా మన్ననూర్ లోని వనమాలికలో నూతనంగా నిర్మించిన 6 కాటేజీలు, 8 సఫారీ వాహనాల ప్రారంభోత్సవంలో ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లలో నివసించే స్థానిక గిరిజన, చెంచు, ఆదివాసీలను అటవీ సంరక్షణ సిబ్బంది, వాచర్ లు ఇతర ఉపాధి కల్పించడం ద్వారా అడవిలో కలప చౌర్యం పూర్తిగా ఆగిపోయిందని, వన్యప్రాణుల సంఖ్య అందువల్ల వన్యప్రాణుల సంరక్షణ, చెట్ల అభివృద్ధి బాగా పెరిగిందన్నారు. తద్వారా అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణహిత టూరిజం అందుబాటులోకి తెస్తామన్నా. రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణ హిత టూరిజాన్ని (Responsible Eco Tourism) ప్రోత్సహిస్తామని అన్నారు. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేస్తామని తెలిపారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ. 1.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 8 సఫారీ వాహనాలు, రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన 6 కాటేజీలను ప్రారంభమవ్వగా వీటిని ఈరోజు నుంచే ఆన్లైన్ ద్వార బుక్ చేసుకునే వెసులుబాటుంది. అమ్రాబాద్ రైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇంతకు ముందు 12 పులులు ఉంటే ఈ సంవత్సరం కెమెరా ట్రాకర్ లో 26 పులులు రికార్డు అయినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News