కర్నూలు జిల్లాలో మిరప ధర బంగారాన్ని తలపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ ధర పైపైకి పోతోంది . ఈనెల 19న కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ధర గరిష్టంగా రూ .38,999 పలికింది . మధ్యస్థ ధర రూ .15,599, కనిష్ట ధర రూ. 3,029 రైతులకు అందింది. ప్రస్తుతం జిల్లాలో ఎండు మిర్చి దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. రాష్ట్రంలో గుంటూరు తర్వాత కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఎండు మిర్చిని రైతులు పండిస్తున్నారు. శుక్రవారం కూడా అదే స్థాయిలో రేటు పలికింది అయితే కొద్దిగా తేడాతో అత్యధికంగా రూ. 30,759, అత్యల్పంగా 12 వేల రూపాయల ధర పలికింది. మొత్తం 2110 బస్తాలు మార్కెట్ కు రాగా 706 క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర బంగారం రైతులకు కొంత ఊరటగానే కనిపిస్తోంది.
Kurnool: రైతులకు సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES