Friday, October 18, 2024
Homeహెల్త్Adulterated Ghee: కల్తీ నెయ్యిని కనిపెట్టడం ఎలా?

Adulterated Ghee: కల్తీ నెయ్యిని కనిపెట్టడం ఎలా?

స్వచ్ఛమైన నెయ్యి ఆరోగ్యానికి ఔషధం

నెయ్యి కల్తీని ఇలా కనిపెట్టొచ్చు

- Advertisement -

మూడు స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యిని నిత్యం తీసుకుంటే అది మన శరీరానికి చేసే మేలెంతో. నెయ్యిలో ఎన్నో ఎసెన్షియల్ న్యూట్రియంట్లు ఉన్నాయి. అంతేకాదు యాంటాక్సిడెంట్లు, ఐరన్, ప్రొటీన్, రకరకాల విటమిన్లు, ఖనిజాలు కూడా బాగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అయితే ఘుమ ఘుమలాడే నెయ్యి సువాసన వస్తే అందరికీ నోరూరుతుంది.

అయితే ఆ సువానతోనే మీరు వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదని భావిస్తుంటే మీరు పప్పులో కాలేసారన్నమాటే. ఎందుకంటే నెయ్యి కల్తీని కనిపెట్టే టిప్స్ కొన్ని ఉన్నాయి. నెయ్యిని కూడా కల్తీ చేయొచ్చు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్, మినరల్ ఫ్యాట్స్, స్టార్చ్ వంటి వాటిని కలిపి అమ్ముతుంటారు.

ఇలా నెయ్యిలో ఆయిల్స్, ఫ్యాట్స్ కలపడం వల్ల అందులో బేటాసిటోస్టెరాల్, కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. ఫలితంగా నెయ్యిలో దాగున్న ఆరోగ్య లాభాలన్నీ నాశనమైపోతాయి. అందుకే నెయ్యి స్వచ్ఛంగా ఉందా లేదా అనే పరీక్షలను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందుకు మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి టెక్స్చెర్ టెస్టు. ఒక చెంచాడు నెయ్యిని తీసుకుని అరచేతిలో వేసుకుని బాగా రబ్ చేయాలి. నెయ్యి కనుక అరచేతిలో కరిగిపోతే అది స్వచ్ఛంగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఆ నెయ్యి వల్ల మీ అరచేతిపై మందంగా పట్టినట్టు అనిపిస్తే మాత్రం అందులో యాడిటివ్స్ చేర్చారని అర్థం. రెండవ టిప్పు టెంపరేచర్ టెస్టు. ఒక చెంచాడు నెయ్యి తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి దాని టెక్స్చెర్ ఎలా మారుతోందో గమనించాలి.

నెయ్యి డార్క్ బ్రౌన్ లోకి వస్తే అప్పుడు అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అలా కాకుండా వేడిచేసినపుడు కరగడానికి అది సమయం తీసుకున్నా, ఆ నెయ్యి లేత పసుపురంగులోకి వచ్చినా దానిని వాడకుండా ఉండడం ఉత్తమం. మనం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదా… కాదా అనడానికి బాటిల్ టెస్ట్ అని ఉంది. మీరు కొన్న నెయ్యిని ట్రాన్సపరెంట్ సీసాలోకి పోసి కొద్దిగా చక్కెర వేయాలి. ఆతర్వాత ఆ సీసా మూత పెట్టి ఆ నెయ్యి బాటిల్ ను బాగా షేక్ చేసి కాసేపు దాన్ని అలాగే ఉంచాలి. కొంతసేపైన తర్వాత ఆ సీసాను గమనించండి. ఆ సీసా అడుగు భాగంలో ఎర్ర రంగు పేరుకుందనుకోండి ఆ నెయ్యిలో యాడిటివ్స్ చేర్చారని అర్థం. సో…ఈ మూడు టిప్ప్ పాటించి స్వచ్ఛమైన నెయ్యిని తినండి. ఆరోగ్యంగా ఉండండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News