ఇద్దరు మాజీ ప్రధానులకు భారత రత్న అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించటం ఇదే తొలిసారి చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహా రావులకు భారత రత్న ప్రకటించారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారత రత్న అవార్డును కేంద్రం ప్రకటించగా ఈ ఏడాది ఇప్పటికే కర్పూరీ ఠాకూర్, ఎల్ కే అద్వానికి భారత రత్న అవార్డు ప్రకటించేశారు.
- Advertisement -
రైతు నేతగా ప్రసిద్ధిగాంచిన చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటించడం ద్వారా ప్రధాని మోడీ మా అందరి మన్ననలు దోచేశారంటూ (దిల్ జీత్ లియా) జయంత్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా దక్షిణాది ప్రజలు ముఖ్యంగా తెలుగువారంతా పీవీకి ఎట్టకేలకు భారత రత్న ఇవ్వటం పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నారు.