Friday, November 22, 2024
HomeతెలంగాణTelangana intresting Budget: ఆసక్తికరంగా తెలంగాణ బడ్జెట్

Telangana intresting Budget: ఆసక్తికరంగా తెలంగాణ బడ్జెట్

6 గ్యారెంటీలకు ప్రాధాన్యత

మహిళలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 7,848 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కేవలం 2,685 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు.

- Advertisement -

ఈ విధంగా సమాజంలోని 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవడానికి పథకాలు బడ్జెట్ లో ఉన్నాయి తప్పితే, వాటికి నిధుల విడుదల లేవు.

ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనావేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం.

సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. “ఇది మా ప్రభుత్వం” అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు… చేసిన అప్పులు… ఏమాత్రం అడ్డం కావు.. కాలేవు. . ఇదే స్ఫూర్తితో, ఆశయంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నాం.

2023-24 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరలలో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయలు నుండి 14,49,708 రూపాయలకు పెరిగింది.

ఆర్ధిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7 శాతం నుండి 11.3 శాతానికి క్షీణించింది. దేశీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం 16.1 శాతం నుండి 8.9 శాతానికి పడిపోయి మరింత ఎక్కువగా క్షీణించింది. పర్యవసానంగా, భారతదేశ జిడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4 శాతం ఎకు) 14. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు, స్థిరమైన 8/57 సంవత్సరం 7.5 శాతం నుండి ఒక శాతం తగ్గి ఈ సంవత్సరానికి 6.5 శాతానికి పడిపోయింది. దేశ స్థాయిలో ఈ వృద్ధి +0.1 శాతంగా ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు తీవ్ర క్షీణతను చవి చూసిందనేది స్పష్టమవుతుంది.

తెలంగాణ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత మరియు స్థిరమైన ధరల వద్ద భిన్నమైన వృద్ధి రేట్లు, తెలంగాణలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం రేటును సూచిస్తున్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణలో 6.65 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ 5.69 శాతంగా ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 5 వ స్థానంలో ఉంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాలలో పనితీరు ఓకేలా లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రాథమిక రంగాలలో ఒకటైన వ్యవసాయం చాలా క్షీణించింది.

వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ 49,059 కోట్ల రూపాయల నుండి 45,723 కోట్ల రూపాయలకి తగ్గి, మైనస్ 6.8 శాతం వృద్ధి రేటుగా నమోదు అయినది. గణనీయమైన తగ్గుదలకి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులు. నైరుతి రుతుపవనాలు 17 రోజులు ఆలస్యమయ్యాయి మరియు సీజన్లో వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు వచ్చాయి. ముఖ్యంగా, ఆగస్టు మరియు అక్టోబరులో పంటలు కీలక దశలలో ఉన్నప్పుడు వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు, దీర్ఘకాలం పాటు పొడిగాలులు, భూగర్భజలాల క్షీణత మరియు కృష్ణా బేసిన్లో లో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ వంటి కీలక పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది.

అదే సమయంలో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలు కూడా వృద్ధి రేటులో తరుగుదలను నమోదు చేశాయి. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం మరియు మరమ్మతు సేవలు,
హోటళ్లు మరియు రెస్టారెంట్లు, రైల్వేలు మరియు వాయు రవాణా వంటి రంగాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే, తయారీ రంగంలో మాత్రం పెరుగుదల కనిపించింది. గత
సంవత్సరంలో నమోదైన 1.3 శాతం వృద్ధితో పోలిస్తే ఈ సంవత్సరం 5.9 శాతంగా వృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం మరియు మైనింగ్, క్వారీ వంటి ఇతర రంగాలు కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2023-24లో అధిక వృద్ధి రేటును నమోదు చేశాయి.

తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం, 2023- 24లో 3,43,297 రూపాయలుగా ఉంటుందని అంచనా. గత ఏడాది తలసరి ఆదాయం 3,09,912 రూపాయలు. దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కనిపిస్తున్నప్పటికి, వృద్ధి రేటు మాత్రం క్షీణించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను మహాత్మాజ్యోతిబాపూలే భవన్ గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశాము.

ప్రతివారం రెండు రోజులలో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొంటున్నాం. ఈ రెండు నెలలలో 43,054 ధరఖాస్తులు వస్తే, వాటిలో 14,951 ఇండ్ల కొరకు, 8,927 భూ సమస్యల గురించి, 3,267 పెన్షన్ ల గురించి మరియు 3,134 ఉద్యోగ కల్పన గురించి వచ్చాయి.

ప్రజావాణిలో వికలాంగులు, వృద్ధులు, మహిళలు మరియు పిల్లల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, అదనపు సౌకర్యాలు కూడా కల్పించాం. వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగుల సహాయార్ధం ఆరోగ్యశ్రీ కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఒక పోర్టల్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులన్నింటిని నమోదు చేసి అవి పరిష్కారం అయ్యే దాక వాటిని పర్యవేక్షించడానికి కలెక్టర్లకి, శాఖాధిపతులకు ఆదేశాలు ఇచ్చాం.

ప్రజావాణి సక్రమంగా నిర్వహించేలా ఒక సీనియర్ ఐ.ఎ.ఎస్. ను ప్రత్యేక అధికారిగా నియమించాం. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే ఆరు హామీలను ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసన సభా వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాము. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో, రెండు గ్యారెంటీలను మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటలలోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం.

ఆరు హామీల అమలుకై అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం, ప్రత్యేకంగా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభలలో ప్రజలు 1.29 కోట్ల దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఈ దరఖాస్తులను క్రోడీకరించే పనికూడా త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది.

మహాలక్ష్మి పథకంలో భాగం అయిన ఉచిత RTC బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 న ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషము వ్యక్తము చేస్తున్నారు. ఈ పథకం సజావుగా సాగడానికి సకాలంలో RTCకి అవసరమైనన్ని నిధులు అందచేస్తున్నాము. ఇప్పటికే నెలకు 300 కోట్ల రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేయడం జరిగింది.

-రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం క్రింద మా హామీ ప్రకారం డిసెంబర్ 9, 2023 నుండి వైద్య ఖర్చుల పరిమితిని 5.00 లక్షల రూపాయల నుండి 10.00 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందున, ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయి సామాన్య ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నందున మా ప్రభుత్వం దీనిని ప్రాధాన్యతగా తీసుకొని గత బకాయిలను కూడా విడుదల చేయడం జరిగింది.

భవిష్యత్తులో కూడా ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సేవలకు ఎటువంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది. మా ప్రభుత్వ హామీలలో మరో ముఖ్యమైన రెండు హామీలు గృహజ్యోతి మరియు 500/- రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ సరఫరా. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకు 500/- రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేశాము. పిబ్రవరి 4, 2024 నాటి రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ పథకాల అమలుకు అమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువవికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాము.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News