Tuesday, October 8, 2024
Homeహెల్త్Hair growth: జుట్టు పెరిగేందుకు ఇవి తినండి

Hair growth: జుట్టు పెరిగేందుకు ఇవి తినండి

మంచి పోషకాహారం తింటే జుట్టు హెల్తీగా ..

జుట్టు పెరగాలంటే ఇవి తినాలి

- Advertisement -

మనం తినే ఆహారంతో కూడా జుట్టు బాగా పెరుగుతుంది. ఎక్కువ ప్రొటీన్లు, న్యూట్రియంట్లు ఉన్న ఫుడ్ ను తినడం వల్ల వెంట్రుకలు పెరగడమే కాకుండా అవి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాయి. సాల్మన్, సార్డినెస్, మెకరల్ చేపలు మనల్ని రకరకాల జబ్బుల బారిన పడకుండా కాపాడడమే కాదు వెంట్రుకలు బాగా పెరిగేలా కూడా తోడ్పడతాయి. అంతేకాదు జుట్టు నల్లగా నిగ నిగలాడేలా చేస్తాయి. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పోషకాల నిధి. వీటితో జుట్టు బాగా పెరుగుతుంది కాబట్టి మీరు తీసుకునే డైట్ లో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

జుట్టును బాగా పెరిగేలా చేసే మరో ఫుడ్ గ్రీన్ యోగర్ట్. మాడుకు రక్త ప్రవాహం బాగా జరిగేలా ఇది సహకరిస్తుంది. జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. ఇందులో విటమిన్ బి5 పుష్కలంగా ఉంటుంది. ఇది శిరోజాలు పలచబడకుండా, రాలిపోకుండా కాపాడుతుంది. పాలకూర కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో
తోడ్పడుతుంది. ఇందులో ఐరన్, బేటా కెరొటెనె, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సిలు సమ్రుద్ధిగా ఉంటాయి. మాడును ఇవి ఆరోగ్యకరంగా ఉంచుతాయి. జుట్టు చిట్లకుండా జామకాయ కాపాడుతుంది. ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

ఒక కప్పు జామపళ్ల ముక్కలు తింటే ఆ రోజు 377 మిల్లీగ్రాముల విటమిన్ సి మీ శరీరానికి అందినట్టు. జామ పండు శరీరానికి కనీసంగా సరిపడే సి విటమిన్ కన్నా కూడా నాలుగు రెట్ల దాకా సి విటమిన్ ని అందిస్తాయి. సెరీల్స్ కూడా ఆరోగ్యకరమైన శిరోజాలను మనకు అందిస్తాయి. ధాన్యాలు, చిక్కుడు గింజలు, పప్పుల్లోని ఐరన్ న్యూట్రియంట్స్ జుట్టు రాలకుండా కాపాడడమే కాదు వెంట్రుకలను ఆరోగ్యంగా, ఎంతో ద్రుఢంగా ఉంచుతాయి కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News